సిపాయిల తిరుగుబాటు ఆద్యుడు!
అవడానికి సిపాయే
తన ఆత్మవిశ్వాసం ముందు
అవని సైతం సాగిలపడాల్సిందే..!
''గోవు, సూకరం కొవ్వు తూటాలను కొరికి ఉపయోగించం..!
మీ అరాచకాలకు మేం తలవొంచం..
భారతీయసంస్కృతి సంప్రదాయాలకు
కట్టుబడి ఉంటా''మని..
తెల్లదొరల ఎన్ ఫీల్డ్ తుపాకీ
ఎదురుగా నిలిచి..
పులిలా గాండ్రించి..
మొదటి స్వాతంత్ర్య సమరానికి నాంది పలికిన
సిపాయిల తిరుగుబాటు ఆద్యుడు..
దేశభక్తుల్లో స్వతంత్ర్య కాంక్ష..
స్వేచ్ఛావశ్యకత తెలియజెప్పిన
ఉద్యమకారుడు..
రెండు దశాబ్దాల బ్రిటీష్ ప్రభుత్వ పునాదులు కదిపిన..
ఆ సంఘటన తెల్ల దొరలు తెల్లబోయేలా చెసింది..
నేటి ఆంక్షల్లేని ఆనందకర జీవితానికి
మొదటి ఇటుక పేర్చిన..మహోన్నత శక్తి!
భారతీయుల ఆలోచనలను
స్వేచ్ఛా స్వాతంత్ర్యాల వైపు మళ్ళించిన
తొలి స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు..'మంగల్ పాండే!
--సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికింద్రాబాద్.