మొమోస్:
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
1.అస్తిత్వ ఆరాటానికి సంకేతంగా.....
కాలభ్రమణానికి సూచికలుగా....(ఇసుకమేటలు)
2.ఇహలోక సుఖాలెన్ని ఉన్నా....
పరలోక పారమ్యాన్ని ఆశ్రయించమంటున్నది.(అలౌకిక)
3.మనిషిని మరుగుజ్జుగా చేసి..
ఆధిపత్యానికి దగ్గర చేస్తూ....(గర్వం)
4.కృత్యపత్రాల సంకెళ్ళు....
అర్థజ్ఞాన ఆర్భాటాల హంగులు...(ఆన్లైన్ చదువులు)
5.మహమ్మారిని తరిమి...
బతుకమ్మ బతుకునీయమ్మా....(రావమ్మా బతుకమ్మా)
6.అమ్మచేతి కమ్మదనానికే
ఎప్పుడూ అగ్రతాంబూలం....
అమృతం పోసి వండుతుందేమో....(రసవంతము)
7.తాత్విక చింతనల మయం...
భక్తిరస అపూర్వ విన్యాసం....
(భాగవత ప్రశస్తి)
8.ఏది దొరికినా.......
మరేదీ దొరకకున్నా....
పయనం సాగాల్సిందే.(ఎక్కడికో పయనం)
9.ఒక్క మాట కదిలిస్తుంది.
ఒక్క ఆచరణ కనికట్టు చేస్తుంది.(విశ్వాసం)
హామీపత్రం:
పై మొమోస్ నా స్వంత రచనలు.వేనికీ అనువాదాలు,అనుకరణలు కావు.