సమాజ సేవకు ముందడుగు వేద్దాం ఇమ్మడి రాంబాబు

సమాజ సేవకు ముందడుగు వేద్దాం ఇమ్మడి రాంబాబు

సమాజ సేవకు ముందడుగు వేద్దాం
సొంత లాభం కొంత మానుకొని

దేశ సేవకై పాటుపడాలని మహనీయుల 

మహోక్తి. కై.. దేశ సేవ కై భాద్యతగా

పౌరుడిగా ముందడుగు వేద్దాం
బడుగు బలహీన వర్గాల జనుల
సేవకై కదం తొక్కుతూ కదులుదాం.
కూడు గూడు గుడ్డ లేని
అణగారిన వర్గాల ఆక్రందనరోదనలు
బాపుటకై బాసటగా నిలుద్దాం.
పేద బీద నిరక్షరాస్యుల కు
చదువుల తల్లి ఆశీస్సులు అందగా..
అక్షరాస్యుల చేయగా చేయి చేయి
కలుపుతూ చేయూతనిద్దాం..
పల్లెల బాగుకై.. జనారోగ్య రక్షణ కై..
వాయుః క్రయవిక్రయాల ఖరీదు నిరోధన కై..
సకలజనుల పరిరక్షణకై
పర్యావరణ పరిరక్షణ కై
భావితరాలకు... వృక్ష సంపద నివ్వగా.
నేడు ఒక్కొక్కరం మొక్కలు నాటుదాం..
రక్షణ చేద్దామని ప్రతిన చేద్దాం.
"""""""""""""""""""""""""""""""""""""""*
*ఇమ్మడి రాంబాబు*
*ఊరు:తొర్రూరు
*జిల్లా:మహబూబాబాద్

0/Post a Comment/Comments