సక్కని సుక్క(వచనకవిత)
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.
ప్రతి ఉషోదయం సుప్రభాతమై
పలకరిస్తుంటే,
పరిమళించిన సుగంధమేదో
మనసుకు ఆహ్లాదాన్ని కల్గిస్తుంటే,
పిల్లతెమ్మరలు సున్నితంగా స్పర్శించి నిద్రలేపుతుంటే,
కాంతివంతమైన తన మోమే
నా కనులకు తొలిపొద్దు వేగుచుక్కై పలకరిస్తుంటే,
మరో రోజుకు ఊపిరి పోసినట్లుంటుంది.
నవ్వుతూ,తలనిమురుతూ లేపే శ్రీమతే తొలిచుక్కలా కనిపిస్తుంది.
ఆ బింబమే ఆలంబనమై హృదయ సింహాసనంపై ప్రతిష్ఠితమవుతున్నది.
వేగుచుక్క నా చుక్కేయై హృదయాన్ని నింపేస్తున్నది.
హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం, అనుకరణ కాదు.