ఉన్న మాటంటే.. ఉలుకెక్కువ..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఉన్న మాటంటే.. ఉలుకెక్కువ..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఉన్న మాటంటే..ఉలుకెక్కువ..!(కవిత)
*******✍🏻విన్నర్*******
ఏం విచిత్రమో గాని,ఈ
లోకంలోని చాలా మందికి,
ఉన్న మాటంటే కోపం వస్తుంది..!

అదే అబద్దాల తారీఫ్ గనుక చేస్తే సంతోషిస్తరు..! పండ్ల
సందులు కనబడ్డేలా హీ.. హీ.. అంటూ ఇగిలిస్తారు..!?

అదే ఉన్నవాస్తవం,
ఉన్నమాటంటే.. 
మీదికి లేస్తారు..!?? 
కయ్యానికి కాలు 
దువ్వుతారు..!
ఏం చేస్తాం మరి,
ఉన్న మాటంటే ఉలుకెక్కువ..గదా..!?
మహానుభావులకు..!??

మనకేంటిలే అనుకోవచ్చు..!?
ఏమన్న అయి చావనిలే అనుకోవచ్చు..!??
ఎందుకులే అనుకోవచ్చు..!?

కాని,ఆ దుర్మార్గుడి వల్ల అమాయకులు మోసపోతున్నారు, 
నష్ట పోతున్నారంటే,
వాడి పనికిమాలిన 
పనుల వల్ల నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడు..

ఎవ్వరూ ఊరకుండరు.,
ఉన్న మాట జెప్పి 
బండారం బయట పెడతారు..!?
ఉన్నమాటంటే ఉలుకెక్కువా..!?  
అని విమర్శించి, 
వాణ్ణి చక్కబరుస్తారు..!
ఐనా వాడికి..తన తప్పు తెలిసినా..వాడు మారడు
ఎందుకంటే,ముందే చెప్పినట్టు..వాడికి
ఉన్న మాటంటే 
ఉలుకెక్కువ..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments