ఓర్పు నశించిన ఓటరు ...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఓర్పు నశించిన ఓటరు ...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

ఓర్పు నశించిన ఓటరు ...

నిన్న స్వాతంత్ర సమరాన
సాహిత్య సాగరాన శ్రీశ్రీ కలాన
...ఉప్పొంగిన అల !
కాదేదీ కవితకనర్హం...

నేడు రాబోయేకాలానికి
కాబోయే రాజకీయ నాయకులు కన్న
...రంగుల కల !
కాదేదీ కమీషన్లకనర్హం...

నిన్న పట్టపగలే ప్రజల్ని దోచుకున్న
...గజదొంగలు !
నేడు చట్టసభలకు ఎన్నికైన
...కొల్లేటి కొంగలు !

నిన్న కూటికే లేక కుమిలి పోయిన
...కుచేలులు !
నేడు కుంభకోణాల్లో ఆరితేరిన
...కుబేరులు !

నిన్న ఓట్లకోసం బిక్షమెత్తిన
...శనీశ్వరులు !
నేడు కోట్లకు పడగలెత్తిన
...కోటీశ్వరులు !

నిన్న ప్రగతికాముకులు
...ప్రజాబంధువులు !
నేడు ప్రజల రక్తాన్నిత్రాగే
...రాజకీయరాబందులు !

జానెడు పొట్ట కోసం
జాతికి ద్రోహంచేసే
...ఓ జలగలారా !
కన్నతల్లి కన్నీటిని త్రాగే
...ఓ కసాయివాళ్లారా !
నీడనిచ్చే కొమ్మలను నరికే
...ఓ నీచులారా !
ఒక్కనిజం తెలుసుకోండి !

ఓటరంటే..."త్రినేత్రుడని"
కళ్ళు తెరిచి కరుణిస్తే మీరు
రివ్వున ఎగిరే తారాజువ్వలౌతారని...
కానీ..."ఓర్పు నశించిన ఆ ఓటరే"
ఆగ్రహించి ఉగ్రరూపం దాలిస్తే
రెప్పపాటు మీరంతా కుప్పకూలిపోతారని...

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

 

0/Post a Comment/Comments