మరోప్రపంచం రావాలి
మానవ సేవయే మాధవ సేవ
ఇది ఒకప్పటి మంచి నానుడి
కానీ నేడు అది కొరవడి
మానవత్వం మసక బారింది
ధనం మూలం ఇదం జగత్ లా తయారైంది
కాసులు కుమ్మరిస్తే పని జరుగుతుంది
కష్టానికి కాళ్ళు పట్టుకుంటే కనికరం కరువైంది
దుష్టులకు నేటి రాజ్యం చేరువైంది
మానవులే మృగాలు గా మారి
అత్యాచారాలు అఘాయిత్యాలకు దూరి
మృగ్యమైన జీవితాన్ని ఎంపీక చేసికొని
పైశాచిక ఆనందానికి పరుగులు తీస్తున్నారు
నీచమైంది హేయమైంది ఎంచుకుంటున్నారు
కార్పొరేట్ పేరుతో కాఠిన్యంతో గోముఖవ్యాగ్రాలై
మానవత్వానికి తిలోదకాలిస్తున్నారు
మంచితనాన్ని మంట గలుపుతున్నారు
తాగేనీరు తినేతిండి నిత్యవసరవస్తువులు
అన్నీ కల్తీ
ధరలు నింగికి చేరి పేదకడుపు పేగులు అరుస్తున్నాయి
అనారోగ్యాలుతో కల్తీ మందులతో
పేదలు కాటికి కాళ్ళు చాపుకు కూర్చున్నారు
ఆర్చేవారు తీర్చేవారు లేక దేవుడి పై భారం వేస్తున్నారు
ఎంత చెప్పినా మానవత్వం మసకబారి పోయింది
నైతికవిలువలు నాశనం అయ్యాయి
ఎవరికి వారు తమను తాము సరిదిద్దికున్నట్లైతే
మళ్ళీ మరోప్రపంచం లో మానవత్వాన్నీ చూడగలమని ఆశిద్దాం
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
9441530829