"ఆదర్శదంపతులు" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"ఆదర్శదంపతులు" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

ఆదర్శదంపతులు

పెళ్ళంటే నూరేళ్లపంట
మూడుముళ్లబంధంతో
ఏడడుగుల అనుబంధంతో
పెనవేసుకున్న పవిత్రబంధం పెళ్లి
తాళాలు మేళాలు మంగళ వాద్యాలు
పిండివంటలు, పట్టుబట్టలు
వేదోచ్ఛారణ మంత్రాలు
నవదంపతుల ఆనందహేళ
మిన్నుముట్టె బంధువులగోల
వివాహమహోత్సవం కనులపండువ

వధూవరులు ఒకరినొకరు 
అర్థం చేసుకుని
కలకాలం తోడునీడగా
కట్టుబాట్లకు కట్టుబడి
జీవనపయణం చేయడం
హిందూధర్మ ఆనవాయితీ

భార్యాభర్తల భాద్యతలు
అత్తమామల దీవెనలు
వియ్యంకుల మర్యాదలు
అప్పగింతలు పలకరింపులు వంటి
ఆత్మీయానురాగాలెన్నో అందంగా
పెళ్ళితంతులో ప్రతిబింబిస్తాయి
కళ్యాణమహోత్సవం లోకానికి
సాంప్రదాయం, మార్గదర్శకం
సీతారాములు మనకు
ఆదర్శదంపతులు
అర్ధనారీశ్వరుడు మనకు
మార్గదర్శకుడు


ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు

0/Post a Comment/Comments