నమస్కారం - మార్గం కృష్ణ మూర్తి,హైదరాబాద్.

నమస్కారం - మార్గం కృష్ణ మూర్తి,హైదరాబాద్.

నమస్కారం

నమస్కారమనేది భారతీయుల సంస్కారం
పూర్వకాలాలనుండి వస్తున్న ఒక ఆచారం  
అది ఒక సాంప్ర దాయం
షేక్ హాండ్ మన సంస్కృతి కాదు
కులాలు వేరైనా , మతాలు వేరైనా 
భాషలు వేరైనా , భావనలు ఒక్కటే
వందనం ,దండం , నమస్కారం 
ఆదాబరుసే , వనక్కం , గుడ్ మార్నింగ్

ఎవరి భాష వారిదే 
ఎవరి సాంప్రదాయం వారిదే

ప్రకృతిలో ఎన్నో వింతలు విడ్డూరాలు
పంచ భూతాలు, అష్టదిక్కులు,నవగ్రహాలు
దేని ప్రాధాన్యత దానిదే , దేని విలువ దానిదే
వాటి విలువ, ప్రాధాన్యత బట్టి వాటికి పూజలు చేస్తారు 
నమస్కారాలు(దండాలు)  పెడుతారు

ఉదయించే భానుడికి నమస్కరిస్తాం
అస్తమించే రవిని చూసి ఆనందిస్తాం
సూర్యుడు ఒకడే, కేవలం మారింది కాలం
ఉదయించే భానుడు, వెలుగునిస్తాడు
అస్తమించే రవి , చీకటిని నింపుతాడు

గుడిలోని దేవుడికి , నమస్కరిస్తాం
గుడిలోకి వస్తూ, గుడి నుండి దిగుతూ 
గుడి మెట్లను తొక్కుతాం
గుడిలో దేవుడు , గుడి ముందు మెట్లు
రెండూ రాళ్ళే
గుడిలోని రాయిని రూపం మారడం వలన
మొక్కుతాం
గుడి ముందు రాళ్ళను ,రూపంలేదు కాబట్టి తొక్కుతాం

జన్మనిచ్చిన తల్లి దండ్రికి, విద్య నేర్పిన గురువుకు , ఆపదలో  ఆదుకున్ళ సాటిమనిషికి నమస్కరిస్తాం

సాటి మనీషి గౌరవానికి యిచ్చే హృదయ స్పందనే నమస్కారం

మనిషికి వినయం, భూషణం
వినయానికి ప్రతి స్పందనే, నమస్కారం

నమస్కారానికి , ప్రతి నమస్కారం పెట్టడం మన భారతీయులకు ఉండ వలసిన సంస్కారం.

- మార్గం కృష్ణ మూర్తి,
హైదరాబాద్.

0/Post a Comment/Comments