వెలిగించి వెళ్లిపో
ఓ మనిషీ !
ఒక చిన్న విన్నపం !
ఈ అవని మనకు ఓ అద్దె కొంప
ఏ రోజైనా కన్ను మూయక తప్పదు
ఆత్మను పరమాత్మకు అద్దెగా చెల్లించి
ఈ ఇల్లు ఖాళీ చేయక తప్పదు
అందుకే నీవు వెళ్ళే ముందుర
ఒక్క దీపమైనా వెలిగించి వెళ్లిపో !
ఒక పాదముద్రనైనా మిగిలించి వెళ్ళిపో !
ఒక్కరికైనా నీ చిరునామా చెప్పి వెళ్ళిపో !
ఒక్కరిలోనైనా చైతన్యాన్ని రగిలించి వెళ్ళిపో !
ఒక్కరినైనా విజ్ఞానజ్యోతిగా వెలిగించి వెళ్ళిపో !
ఒక్కరికైనా మంచిని మానవత్వాన్ని పంచి వెళ్ళిపో !
ఒకరి జీవితాన్నైనా పచ్చనిచెట్టుగా మార్చి వెళ్ళిపో !
ఒక్కరి కంటిలోనైనా కన్నీటిదారలను తుడిచి వెళ్ళిపో !
ఒక్కరి మనసులోనైనా మాలిన్యన్ని తొలగించి వెళ్ళిపో !
ఒకరి ముఖంలోనైనా చిరునవ్వుదీపం వెలిగించి వెళ్లిపో !
ఒక్కరిలోనైనా నీవు ఒక మధురజ్ఞాపకంగామారి వెళ్ళిపో !
ఒక్కరి గుండెగుడిలోనైనా దైవమై కొలువుండేలా వెళ్ళిపో !
ఆపై నీ జన్మధన్యం! బ్రతుకుఆదర్శం! చరిత్ర చిరస్మరణీయం !
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502