తొలిపొద్దు --- డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, మేడ్చల్.

తొలిపొద్దు --- డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, మేడ్చల్.

తొలిపొద్దు

--- డా.రామక కృష్ణమూర్తి,
బోయినపల్లి,మేడ్చల్.


మంచు దుప్పటి వదులుతున్న వేళ
జీవితనౌక ప్రారంభం.
జోడెడ్ల బండి మీద జోరుగా
ఏరువాకకు పయనం.
నేలతల్లి పూజకు ప్రాతఃకాల ముహూర్తం.
రైతన్నల హృదయంలో తొలకరి
పులకరింతలు
కచ్చడం బండి రూపు మారినా
కర్తవ్యం మరువలేదు సుమా!
సస్యలక్ష్మికి నేలతల్లి శ్రీమంతం
చేయాలి.
విత్తు పైరై మొలకెత్తాలి.
అన్నపూర్ణను ఆవిష్కరించాలి.
కాలమేదైనా కృషీవలుని నిరంతర వ్యవసాయం.
దేశాభివృద్ధికి తిండి పెట్టి నిలబెట్టే హాలికత్వం.
ప్రతి ఉదయమూ నైవేద్యమై
సుప్రభాత సేద్య వందనం.

హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం,అనుకరణ కాదు.

0/Post a Comment/Comments