మా నాన్నే నా హీరో (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

మా నాన్నే నా హీరో (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

మా నాన్నే నా హీరో

      ఒకసారి నేను మా నాన్న మా పక్కనే ఉన్న చిన్న వలస వెళ్ళాము.తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది.ఆ దారి పూర్తిగా చీకటి.మధ్యలో చిన్న ఏరు. ఆ రోజు వాన కురుస్తుంది.ఆ ఊరు కి వెళ్ళడానికి రావడానికి అదే మార్గం తప్ప వేరొకటి లేదు.జోరువాన ఒకపక్క ఏరు దాటాలి ఒకపక్క.చీకటి ఇంకొకవైపు. నేను నాన్నను విడిచి అస్సలు వుండే వాడిని కాను.ఆ రాత్రి నాన్న నన్ను  భుజాల పైన ఎత్తుకొని అతి కష్టం మీద ఏరు దాటారు.ఎందుకురా వీడు నాతో వచ్చాడు అని కక్క లేక మింగలేక నన్ను ఏమి అనలేక అతి జాగ్రత్తగా కాదు కాదు అతి ప్రేమగా నన్ను తీసుకొని వచ్చారు.నాకు చీకటిఅంటేభయంకూడాను.నేనుఅంత సేపు కూడాకళ్ళుమూసుకొనే వున్నాను. నాపై ఎంత కోపం వచ్చిన నాన్న నాకు ఒక్క మాట కూడా అనలేదు. సరికదా మా నాన్న నాతో నాన్న ఏరు దాటేశామ్ అని ఎంతో ప్రేమతో చెప్పి భుజం పై నుండి కిందకు దింపారు. 
         
    ఈ రోజు కు అది తలచుకుంటే నా గుండే బరువెక్కిపోతాది.నా హృదయం ద్రవించుకు పోతాది.నాన్న జీవితం కన్నీటి సంద్రం. ఈ రోజు నేను ఒక స్థాయి లో వున్నాను.కానీ నాన్న మాత్రం నా దగ్గరలేరు. రాని లోకం నుండి తను నాపై కలలు గన్న నా జీవితాన్ని చూస్తూ దీవిస్తూ నా గుండె గుడిలో దీపమై వెలుగుతూ నన్ను కాపాడుతూ వున్నారు.అందుకే మా నాన్నే నా హీరో.నాన్నా నీకు వందనం .కష్టాల కడలి లో నువ్వు మునుగుతూ మా అందరినిఆశలపల్లకిలో ఊరేగించావు.అందుకే నీకు గులాబీ మాలికల వందనం.

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
         సాలూరు
          విజయనగరం జిల్లా
           9441530829

0/Post a Comment/Comments