మంచి ఉషస్సు (పసుమర్తి నాగేశ్వరరావు, టీచర్)

మంచి ఉషస్సు (పసుమర్తి నాగేశ్వరరావు, టీచర్)

మంచి ఉషస్సు


మొక్కి మొక్కి మొరపెట్టుకున్నా
వెక్కివెక్కి ఏడుస్తు కన్నీళ్లు కారుస్తున్నా
నక్కి నక్కి చూస్తున్నారే
బుక్కీ బుక్కి దోచేస్తున్నారే

గుచ్చి గుచ్చి ప్రశ్నించినా
గుక్కతిప్పకుండా అడిగినా
గుక్కెళ్ళు దిగ మింగుతున్నా
అందుతున్న సాయం జనానికి నిండుసున్నా

అభాగ్యుల్లా అల్లాడుతున్నారు
నిర్భాగ్యుల్లా బిక్కుమంటున్నారు
దౌర్భాగ్యుల్లా బాధ భరిస్తున్నారు
సౌభాగ్యపు రోజులు కోసం ఎదురుచూస్తున్నారు

మనోనిబ్బరం తో ముందుకెళ్తున్నా
గుండెనిబ్బరం తో దూసుకెళ్తున్నా
మండే గుండెను మభ్యపెడుతున్నా
పిడికెడు గుండె నీరు కారిపోతున్నది

ఇది ప్రకృతి ప్రకోపమో
ప్రజల నిర్లక్ష్యమో
పాలకుల అలక్ష్యమో
జరిగేదంతా జరుగుతుంది

ఒక్కరిని అని ఏం లాభం
ఏ ఒక్కరికి లేదు ఇందులో లాభం
అందరికి అందరూ అనుభవిస్తున్నారు
అంతుచిక్కని గమ్యమైనా గమ్యం కోసం వెతుకుతున్నారు

దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు
దివిలో దైవం ప్రసాదించాలి మనకు శ్రేయస్సు
దయగల హృదితో చేయాలి తపస్సు
దొరుకుతుంది తప్పక త్వరలో ఓ మంచి ఉషస్సు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
         సాలూరు
          విజయనగరం జిల్లా

0/Post a Comment/Comments