చార్మినార్
--- డా. రామక కృష్ణమూర్తి,
బోయినపల్లి, మేడ్చల్.
నాలుగు మినారుల చార్మినార్
సంతోషానికి చిహ్నం.
ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం.
మతసామరస్యానికి
మకుటాయమానం.
స్నేహానికి దర్పణం.
ప్లేగును పారద్రోలిన
నాలుగు ముఖాల కట్టడం.
నిజాము నవాబుల వైభవానికి,
పాలకుల దర్పానికి చారిత్రక నిదర్శనం.
హైద్రాబాదు రాజ్యానికి తలమానికమై,
ప్రపంచ ప్రసిద్ధి పొందిన వారసత్వ నిలువరం.
నూట నలభై తొమ్మిది మెట్లతో
నాలుగు వైపులా పెద్ద గడియారాలతో,
మధ్యలో నీటి ఫౌంటెనుతో,
భాగ్యలక్ష్మి ఆలయంతో,
వ్యాపారానికి ప్రసిద్ధమైన బజారులతో,
నలువైపులా కమానులతో,
చౌరాసా షహర్కే షాన్ గా
వెలుగొందుతున్నది.