కలం కవిత - సమాజ హితం

కలం కవిత - సమాజ హితం

కలం కవిత  - సమాజ హితం

అక్షరాలా కూర్పు పదం -
పదాల  కూర్పు వాక్యం 
వాక్యాల సమ్మేళనమే ..
అందమైన కవిత 
అగ్గిపుల్ల ,సబ్బుబిళ్ళ 
కవితాకేది అనర్హం ..? 
అన్న శ్రీ శ్రీ స్పూర్తి యే నా
వచన కవితకు మూలం .
నా భావోగ్వేదాలకు 
అక్షర రూపం నా కవిత 
మనిషిని ఆలోచింప చేసేది
సహజ కవిత. 
పల్లె జనాన్ని రంజింప జేసేది  జానపద కవిత.
ఉద్యమాలను ఉర్రుతలూగించేది పదునైన కవిత. 
చిన్నారుల కేరింతలాటలకు బాలగేయాల కవిత. 
 యువతను ఉషారెత్తించేది
సినీగేయ కవితారచన.  
భక్తుల్లో జ్ఞాన భోదన పెంచేది 
కవితా సంకీర్తన 
విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచేది పాఠ్యాంశ రచన. 
గొంతెత్తి పాడించేది ఆశుకవిత. 
రంగస్థలాన రంజింప చేసేది పద్యకవితా రచన. 
సమాజాన సమానత్వం కోరేది
కలం కవిత. 
ప్రజా, ప్రభుత్వ వారధి 
వార్తా హరుల పత్రికారచన .
సమాజాన్ని మేలుకొలిపేది కవికులం 
సంఘటితం సంఘ బలమని చాటేది 
నేటి ప్రపంచ కవితా సుదినం !

                --ఇమ్మడి రాంబాబు (రామ్) తోఱుర్ .
                    

0/Post a Comment/Comments