మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.... మహేష్ కురుమ

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.... మహేష్ కురుమ

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా

ఏ పి జే అబ్దుల్ కలామ్ గారి పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధిన్ అబ్దుల్ కలామ్ "ఓ సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికిని తన యొక్క ప్రతిభాపాటవాలతో అపూర్వమైన మేధస్సుతో యావత్ ప్రపంచంసైతం జేజేలు పలికించుకున్న గొప్పవ్యక్తి అబ్దుల్ కలామ్.

ఆయన ఒక ఉపాధ్యాయుడు అలాగే ఒక సైంటిస్ట్  మరియు దేశంలో అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని చేపట్టడం, దానికి తన అపూర్వమైన వ్యక్తిత్వంతో కొత్త వన్నెలు అద్దడంలో ఎక్కడ కనీవినీ వుండము.

భారతదేశాన్ని ఎందరో మహానుభావులు,మేదావులు, హేమాహేమీలు పరిపాలించారు. ప్రజలకు మార్గదర్శనం చేశారు. కానీ వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో అంత ప్రభావం చూపిన వ్యక్తి మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. చిన్నపిల్లలనుండి మేదావుల వరకు అందరు కూడ ఆయనను ఆత్మీయుడు, మార్గదర్శిగా భావిస్తారు.

అబ్దుల్ కలామ్ గారు నేను ఎల్లప్పుడూ నిత్య విద్యార్థినే అని వినయంగా చెప్పుకునేవారు. ఏదోఒక విషయంలో చిన్నపిల్లల నుండి మరియు మేధావుల నుండి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేసేవారు.

అబ్దుల్ కలామ్ గారు రాష్ట్రపతి పదవి చేపట్టే కంటే ముందు ఆయన DRDO మరియు ఇస్రో లో ఏరోస్పేస్ ఇంజినీర్ గా పని చేశారు. అబ్దుల్ కలామ్ గారు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న బిరుదు పొందారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలువబడుతున్నారు.

...మహేష్ కురుమ,
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు,
వికారాబాద్,
9642665934.

0/Post a Comment/Comments