అమ్మానాన్నలేకుంటే?... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

అమ్మానాన్నలేకుంటే?... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

అమ్మానాన్నలేకుంటే?

ఆ దైవమే లేకుంటే
...ఈ సృష్టే లేదు

ప్రకృతిలో
పచ్చనివృక్షాలే లేకుంటే
...ప్రాణవాయువే లేదు

ఆ సూర్యచంద్రులు
చుక్కలే లేకుంటే
...ప్రపంచాన ఈ వెలుగే లేదు

బడిలో గురువే లేకుంటే
చదువులే చెప్పకుంటే
...మనకీ జ్ఞానమే లేదు

ఆ జ్ఞానమేలేకుంటే
...మనకీ సుఖజీవనమే లేదు

అమ్మా నాన్నే లేకుంటే
...అసలీ మానవజన్మే మనకు లేదు

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
 

0/Post a Comment/Comments