హస్త సిరి శ్రీమతి సత్య మొం డ్రెటి

హస్త సిరి శ్రీమతి సత్య మొం డ్రెటి


 హస్త సిరి

హస్త మందలి గోరింట
అరిచేతి సిరుల పంట
అమ్మ రుబ్బిన గోరింటాకు
కుండ పెంకు తాటియాకు
మిశ్రమంతో తయారయ్యేది
ఆతురతతో అక్కచెల్లెల్లం
పోటాపోటీలు గా సుందర చిత్రాలతో అరి చేతులు అలంకరించి... సింధూరం నాది
మందారం నీది అని వాదులాట
మస్తిష్కం మరువని జ్ఞాపకము
ఆషాడమాస జగన్నాథుని రథోత్సవం లా
మగువలకు గోరింటాకు మహోత్సవం..
ముత్తయిదువలు ,కన్యలు పిల్లలు, కలకాల సిరి గా గోరింటాకును అలంకరించుకోవడం తెలుగింటి ఆచారం.
ఔషధ గుణాలున్న గోరింటాకును ఆరోగ్య ఆరోగ్య కారకంగా ఆషాడ మాసాన నిర్ణయించారు తెలివైన మన పూర్వీకులు.
ఆషాడం ఉండ్రాళ్ళతద్ది అట్లతద్ది వివాహ సమయములందు లక్ష్మీ రూపమైన గోరింటాకును చేతులకు పెట్టు కోవడం రివాజు
నాగరికత ప్రబలిన ఈ రోజుల్లో గోరింటాకు కోను లు సదా దొరుకుతుంది.. అన్ని వేళలా అమ్మాయిలు అలంకరించుకుంటు నారు. కోను కన్నా స్వచ్ఛమైన గోరింటాకు మిన్న.. చర్మ వ్యాధి నివారిణి..
కవుల కలం లో విరిసి  మెరిసిన
గోరింటాకు నా నెచ్చలి .. నా 
హస్త సిరి...
గోరింటపూసింది కొమ్మలేకుండ
మురిపాలా అరచేత మొగ్గా తొడిగిందీ.... మగువ లందరికీ శ్రీరామరక్ష....

పేరు: శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్

0/Post a Comment/Comments