నిలువెత్తు నిజాయితీ (కథ).
--------------------------------------------
రుద్రవరం గ్రామంలో రాజయ్య, రాజమణి అను పేద దంపతులు నివసిస్తూ ఉండేవారు. భర్త నిరక్షరాస్యుడు. భార్య మాత్రం పదవ తరగతి వరకు చదువుకున్న ది. రాజయ్య కొబ్బరి బోండాలు అమ్మే వాడు. వారికి ఇద్దరూ పిల్లలు. వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కొబ్బరి బోండాలు అమ్మే డబ్బుతో సంసారాన్ని నెట్టుకొస్తున్నారు.
ఇలా ఉండగా ఒక నాడు రాజయ్య కొబ్బరి చెట్టు ఎక్కి బోండాలు కోయబోయి ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడ్డాడు. విషయం తెలిసిన అతని భార్య పిల్లలు వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టరు పరీక్షించి చూసి , కాళ్లు వచ్చే ప్రశ్న లేదు. కుంటి బ్రతుకు బ్రతకాల్సిందే అన్న మాటలు విన్న రాజమణి హతాశురాలైంది. చేతిలోని డబ్బంతా అతని వైద్యానికి సరిపోయింది. అప్పటినుండి ఆమె కష్టాలు ప్రారంభమయ్యాయి.
ఆమె ఎలాగో అలాగా గుండె దిటవు చేసుకుని, తాను చదువుకున్నది కాన ఏదైనా చిన్నపాటి ఉద్యోగానికి అప్పటినుండి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక నాడు ఆ వూరి గ్రామ పంచాయితీ అధికారిని కలసి పని ఇప్పించమని కోరింది. ఆమె దీన అవస్థను గమనించిన అధికారి
"చూడమ్మా! పదవ తరగతి చదివిన దానిని. నీకు తగ్గ ఉద్యోగం మా కార్యాలయంలో ప్రస్తుతానికి లేదు. నీవు చేస్తానంటే గ్రామములోని రోడ్లను ఊడ్చే సిపాయి పోస్టు ఇవ్వగలను అని అన్నాడు"
రాజమణి వెంటనే"థాంక్స్ సార్!
నా కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏ చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు.
అదే నాకు శ్రీరామరక్ష అని ఒప్పుకొని పనిలో చేరి పోయింది.
పాపం అలా రాజమణి తోటి సఫాయి వారితో రోజు ఉదయం, సాయంత్రం గ్రామ రోడ్లను, కాలువలను శుభ్రం చేస్తూ సక్రమంగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఓ రోజు సైడు కాలువలు సుబ్రం చేస్తుంటే కాలువలో ఆమెకు ఓ బంగారు లాకెట్ ఉన్న గొలుసు దొరికింది. తోటి సిపాయిలు చూసి ఆశ్చర్యంతో"రాజమణి! మన పంట పండింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఈ నగను అమ్మేసి మన మైదుగురం పంచుకుందాం."
అనగా ఆ మాటలు విన్న రాజమణి
మీరు ఎన్నాళ్ళ నుండో ఈ గ్రామంలో కాలువలను శుభ్రం చేస్తూ, రోడ్లను ఊడుస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నగనుఅమ్మి, తప్పుడు పని చేసి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. నా ఉద్యోగంలో మన్ను పోయ వద్దు. పాపం ఎవరు పోగొట్టుకున్నారో, వారు ఎంత బాధ పడుతున్నారో వారి పాపం మనం మూటకట్టుకోవద్దు. ఈ పాపపు సొమ్ము మనకొద్దు. ఈ నగను గ్రామ అధికారికి అప్ప చెప్పుదాం."అంది. తోటి సఫాయిలు "ఏం రాజమణి!
నీకేమన్నా బుద్ధుందా? కలిసొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుతావా! వద్దు.
మా మాట విని నగను అమ్మేద్దాం అన్నారు" మీరు ఎన్ని చెప్పినా, నాకు పాపపు సొమ్ము వద్దు. గ్రామాధికారి కి అప్ప చెపుదాం పదండి అంటూ వారిని తోలుకొని గ్రామాధికారి వద్దకు వెళ్లి ఆ నగను
అప్పజెప్పింది.
గ్రామాధికారి ఆ నగను అటు ఇటు తిరిగేసిచూసి ఆశ్చర్యపోయాడు. నగకున్న లాకెట్ తీసి చూడగా అందులో అతని భార్య బొమ్మ , తన బొమ్మ ఉండడం గమనించి, సంతోషంతో రాజమణిని మెచ్చుకొని"చూడు రాజమణి! ఇంత ఖరీదైన నగను నీవు అప్ప చెప్పినందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఇంతవరకు గతంలో కూడా రోడ్డు సైడ్ కాలువలలో చిన్న చిన్న ఉంగరాలు, మెట్టెలు, చెవి దిద్దులు మాత్రమే దొరికాయి. కానీ దొరికిన సఫాయిలు మాకు తెలియకుండా వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నారు. వాటిని ఎవరు అప్పజెప్పలేదు. అలాంటి వారిపై ఇప్పటికీ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మరి ఈ నాడు నీవు ఇంత ఖరీదైన నగను అప్పజెప్పి తోటి సఫాయి వారికి ఆదర్శంగా నిలిచావు. అందుకు నిన్ను అభినందిస్తున్నా. అంతేకాకుండా సఫాయి ఉద్యోగం నుండి నిన్ను ప్రమోట్ చేస్తూ బిల్ కలెక్టర్ ఉద్యోగం ఇస్తున్నా. అలాగే మీ సహచర అ నలుగురు సఫాయీలకు ఓ ఇంక్రిమెంట్ ఇస్తున్న అని అనగానే ఆఫీసు సిబ్బంది అంతా చప్పట్లు కొట్టారు. అందరూ ఆమెను మెచ్చుకొని పూలదండలో ముంచేశారు. తనకు జరిగిన ఈ ఆనంద సన్నివేశాలను తలుచుకుంటూ రాజమణి ఆ దేవునికి తన మనసులోనే నీరాజనాలను అర్పించుకుంది. చివరకు నిలువెత్తు నిజాయితీయే గెలిచింది.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.