లక్ష్యం - *మార్గం కృష్ణ మూర్తి*

లక్ష్యం - *మార్గం కృష్ణ మూర్తి*

లక్ష్యం

మనిషికి
లక్ష్యం లేకపోతే
భక్షకుడౌవుతాడు!

మనిషికి
లక్ష్యం ఉంటే
మోక్షకుడౌవుతాడు!

మనిషిగా పుట్టినపుడు
ఏదో ఒకటి సాధించాలనే
ఒక ఆలోచన ఉండాలి
ఒక కోరిక ఉండాలి
ఒక తపన ఉండాలి
ఒక ఆశయం ఉండాలి!

భారత మాజీ రాష్ట్రపతి
డా. అబ్దుల్ కలాం గారంటారు
*కలలు కనండి,అవి సాధించడానికి*
*నిరంతరం కృషి చేయండి, సాకారం* *చేయండి* అని
కోరికలు నెరవేరాలంటే
క్రమశిక్షణ అలవర్చుకోవాలి
పట్టుదలతో ప్రయత్నించాలి
నిరంతరం సాధన చేయాలి
ప్రయత్నం చేస్తే సాధించ
లేనిది అంటూ ఏమీ ఉండదు!

ప్రతి మనిషి ప్రకృతి నుండే నేర్చుకును
ప్రక్క వారి నుండి మరికొంత నేర్చుకును
పరిశీలించు , పరిశోధన చేయు
దేనికైనను , ఎవరికైనను
కావల్సింది లక్ష్యమే
లక్ష్యం నెరవేరాలంటే,
ఉండాలి తపన!

అధికంగా చదువవలెనన్నా
పెద్ద ఉద్యోగం చేయవలెనన్నా
పెళ్ళి చేసుకోవాలన్నా
పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా
గొప్ప పేరు సంపాదించాలన్నా
మంచి గృహం నిర్మించుకోవాలన్నా
ధనం సంపాదించాలన్నా
మరేదైనా సాధించాలన్నా
ముందు ఆలోచన కలుగాలి
ఆరాటం , ఆత్రుత ఉండాలి
కోరిక ఉండాలి , యిష్టం ఉండాలి
పట్టుదల ఉండాలి ,లక్ష్యం ఉండాలి
ఆశయం ఉండాలి , తపన ఉండాలి!

ఏ ఆశ , ఏ కోరిక
ఏ ఆలోచన ,ఏ ఆశయం
ఏ లక్ష్యం , ఏ తపన
లేని వారు పరాన్న జీవులుగా
చరిత్రలో కనుమరుగవుతారు!

--- *మార్గం కృష్ణ మూర్తి*
హైదరాబాద్

0/Post a Comment/Comments