నేటి భారతం

నేటి భారతం

నేటి భారతం                

ఎందరో దేశభక్తుల త్యాగఫలం నేటిభారతం
74ఏళ్లనుండి ఇంతింతై వటుడింతైనట్లు ఎదుగుతుంది
ఇది విశాలభారతం విశేషభారతం
మహోన్నోత ఆర్ధికవ్యవస్థ కలిగిన భారతం

ఎంత ఎదిగిన నాటి నుండి నేటి వరకు పోలేదు పేదరికం
జరుగుతున్నది వృద్ధి కానీ లేదు సమృద్ధి
అమలు అవుతున్నాయి పంచవర్ష ప్రణాళికలు
అందులో లేవు అభివృద్ధి గుళికలు

నాడు నేడు ఏనాడు ఎదుగుతున్న వాడే ఎదుగుతున్నాడు
ఎగిరే వాళ్ళను ఎగరేసుకు పోతున్నారు
బలవంతులదే రాజ్యం.పెత్తందార్లకే భోజ్యం
ఇది నేటి భారత ఆర్థిక స్వరాజ్యం

ధరలు ఆకాశానికి ధనవంతులు ఆకాశంలో
ఉచితాలు ఎక్కువ ఉత్పత్తులు తక్కువ
అక్షరాలలోఅభివృద్ధి  అంకెలలో సమృద్ధి ఆడిగినవాడికి శుద్ధి
ఊరకే ఉన్నవాడే అసలైన బుద్ధి

ఉచితాలు మానాలి ఉద్యోగాలు పెంచాలి
సోమరితనం పోగొట్టి స్వాలంభన తేవాలి
మానవ వనరులను నిస్వార్ధం గా వినియోగించాలి
ఒక్కసారి ఒకే ఒక్కసారి గాడి పెడితే స్వర్ణయుగమే మనభారతం

సహజవనరులుఅనేకంసహజత్వం తో మెరుగు పరచాలి 
స్వార్ధమే విడిచి స్వచ్ఛతసచ్చీలత లను పెంచాలి
అన్నీ ఉన్నాయి అంగట్లో ఏదో ఉన్నట్లు కాకుండా ముందడుగు వేయాలి
నడుం బిగించి కథం తొక్కితే మేరా భారత్ మహాన్ హై
ఇదే నవభారత ఆర్థికవ్యవస్థ

రచన   పసుమర్తి నాగేశ్వరరావు
             సాలూరు
             విజయనగరం జిల్లా
             9441530829
 


0/Post a Comment/Comments