(ప్రక్రియ: మధురిమలు)
01.
మట్టిని బట్టి
కుండనెంచకు
కుండను బట్టి
కులాన్నెంచకు
02.
మట్టిని బట్టి
కుండ యుండును
కుండను బట్టి
ధరలు యుండును
03.
మట్టి కుండల వంట
ఆరోగ్యము నుండును
ఆరోగ్యముల యింట
ఆనందమె నుండును
04.
మట్టి కుండ నీరు
చల్లగా నుండును
చల్లనైన నీరు
తీయగా నుండును
05.
కుండ పగిలిన
అతుకదెన్నడు
మనసు విరిగిన
కలువదెన్నడు
06.
నాడు కుండ లేని
ఇల్లెక్కడ లేదు
నేడు స్టీలు లేని
ఇల్లే కనబడదు
07.
వంటకు కావాలి
మట్టి కుండలేను
కాటికి కావాలి
మట్టి కుండలేను
08.
మట్టి కుండలలోన
నీరును పోయ వచ్చు
మట్టి కుండలలోన
ధాన్యం పోయవచ్చు
09.
కుండైనా కలిసిపోవు
ఏనాడైన మట్టిలో
మనిషైనా కలసి పోవు
ఏనాడైన మట్టిలో
10.
కుండ నేర్పును
పరిశుభ్రతను
కుండ నేర్పును
క్రమశిక్షణను
11.
రంగు రంగుల
కుండ లుండును
వంకు వంకుల
కుండ లుండును
12.
కుండ నాణ్యత బట్టి
కుండ ధరలు పెరుగును
మనిషి మాటను బట్టి
మనిషి విలువ పెరుగును
--- మార్గం కృష్ణ మూర్తి,
01.
మట్టిని బట్టి
కుండనెంచకు
కుండను బట్టి
కులాన్నెంచకు
02.
మట్టిని బట్టి
కుండ యుండును
కుండను బట్టి
ధరలు యుండును
03.
మట్టి కుండల వంట
ఆరోగ్యము నుండును
ఆరోగ్యముల యింట
ఆనందమె నుండును
04.
మట్టి కుండ నీరు
చల్లగా నుండును
చల్లనైన నీరు
తీయగా నుండును
05.
కుండ పగిలిన
అతుకదెన్నడు
మనసు విరిగిన
కలువదెన్నడు
06.
నాడు కుండ లేని
ఇల్లెక్కడ లేదు
నేడు స్టీలు లేని
ఇల్లే కనబడదు
07.
వంటకు కావాలి
మట్టి కుండలేను
కాటికి కావాలి
మట్టి కుండలేను
08.
మట్టి కుండలలోన
నీరును పోయ వచ్చు
మట్టి కుండలలోన
ధాన్యం పోయవచ్చు
09.
కుండైనా కలిసిపోవు
ఏనాడైన మట్టిలో
మనిషైనా కలసి పోవు
ఏనాడైన మట్టిలో
10.
కుండ నేర్పును
పరిశుభ్రతను
కుండ నేర్పును
క్రమశిక్షణను
11.
రంగు రంగుల
కుండ లుండును
వంకు వంకుల
కుండ లుండును
12.
కుండ నాణ్యత బట్టి
కుండ ధరలు పెరుగును
మనిషి మాటను బట్టి
మనిషి విలువ పెరుగును
--- మార్గం కృష్ణ మూర్తి,
హైదరాబాద్.