ఏది శాశ్వతము?

ఏది శాశ్వతము?


పసిడి వన్నెల తనువు పంచభూతాత్మకము
అది లీనమౌ తుదకు ఆ భూత శ్రేణిలో

నిన్నంటి ఉన్నట్టి నీబంధు బలగములు
నీలోని జీవునికి నిజబంధులై మెలుగు

నీసతియు,నీసుతులు నీవెంట రారెపుడు
నీ యాస్థి పాస్థులూ నిక్కంబు కావెపుడు

నీవు చేసిన మంచి నిరతమై భువి నిలుచు
నీవెంట యుండేది నిఖిలవిశ్వేశుడే!


కవిచక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125

(ఇష్టపది)

0/Post a Comment/Comments