అంశము: చైనా లడ్ఢాక్ ఆక్రమణ -వీర భారత జవానుల పోరాటం
శీర్షిక: జై భారత్.. జై జై భారత్..!
ప్రజాస్వామ్య విలువలను పాటించి
ప్రపంచ శాంతికి కట్టుబడి
ప్రపంచ ప్రగతికి అంకితమై
పొరుగు దేశాల పట్ల బాధ్యత వహించి
ప్రపంచానికే దిక్సూచియై
ప్రపంచ మన్ననలు పొందుతుంది భారతదేశం..!
సామ్రాజ్యవాద కాంక్షతో
సోదర దేశాలను బెదిరిస్తూ
సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తూ
సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తూ
సైనికులపై దాడులకు దిగుతూ
స్వార్థంతో నడుస్తున్నది డ్రాగన్ దేశం..!
భారతదేశం ఎదుగుదల కంటికింపు కాగా
భారత విధానాలు బెంబేలెత్తించగా
బిత్తరపోయిన చైనా ఇబ్బంది పెట్టదలచి
బయట శక్తులను భారత్ పై ఎగదోసి
భయపెట్టడానికి ప్రయత్నించి భంగపడి
యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది..!
సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తూ
సరిహద్దు వివాదాలను పెంచి పోషిస్తూ
చైనా దుందుడుకు చర్యలకు దిగుతుంది..!
భారత రక్షణ వ్యవస్థ బలాన్ని చాటేలా
డ్రాగన్ యుక్తులకు దీటుగా స్పందించి
భారత్ సత్తాను చైనాకి రుచిచూపించాలి ..!
ఇది నా స్వీయ రచన
పిల్లి.హజరత్తయ్య, శింగరాయకొండ