పసికూనలు
చిట్టీపొట్టి బాలలం
చిన్నారిబాలలం.!!
బుడి బుడి అడుగుల
చిచ్చుర పిడుగులం
రేపటి బంగారు బాటకు
భావితరాల పౌరులం.
!!చిట్టి!!
ఆట పాటలతో
అలసిసొలసిన
పసి కూనలం.
కోయిలమ్మకు
తోటి రాగాల
మాలికలం.
!!చిట్టి!!
సాగిపోయే సరదాలా
సాగర అల్లికలం.
గారాబ మారాబంతో
అందలమెక్కిన తారలం.
!!చిట్టి!!
పూతోటల పరిమళ
పూదండ మాలలం.
కల్లా కలపటం ఎరుగని
పసి కూనలం.
!!చిట్టి!!
పలకా బలపం చేతబట్టిన
చిరు చిరు ఆశల కెరటాలం.
చెంగు చెంగున తిరిగే
సీతా కోక చిలుకలం.
!!చిట్టి!!
గురువుల పూజ్యులం.
తల్లిదండ్రులు ఆరాధ్యులం.
తోటిమిత్రుల ఆప్యాయతలం.
భారతమాత ముద్దుబిడ్డలం.
!!చిట్టి!!
అందరూ మెచ్చిన
అల్లరి పిల్లలం.
బాలలం బాలలం
భావిభారత పౌరులం.
!!చిట్టి!!
--వి. కృష్ణవేణి
వాడపాలెం.
చిట్టీపొట్టి బాలలం
చిన్నారిబాలలం.!!
బుడి బుడి అడుగుల
చిచ్చుర పిడుగులం
రేపటి బంగారు బాటకు
భావితరాల పౌరులం.
!!చిట్టి!!
ఆట పాటలతో
అలసిసొలసిన
పసి కూనలం.
కోయిలమ్మకు
తోటి రాగాల
మాలికలం.
!!చిట్టి!!
సాగిపోయే సరదాలా
సాగర అల్లికలం.
గారాబ మారాబంతో
అందలమెక్కిన తారలం.
!!చిట్టి!!
పూతోటల పరిమళ
పూదండ మాలలం.
కల్లా కలపటం ఎరుగని
పసి కూనలం.
!!చిట్టి!!
పలకా బలపం చేతబట్టిన
చిరు చిరు ఆశల కెరటాలం.
చెంగు చెంగున తిరిగే
సీతా కోక చిలుకలం.
!!చిట్టి!!
గురువుల పూజ్యులం.
తల్లిదండ్రులు ఆరాధ్యులం.
తోటిమిత్రుల ఆప్యాయతలం.
భారతమాత ముద్దుబిడ్డలం.
!!చిట్టి!!
అందరూ మెచ్చిన
అల్లరి పిల్లలం.
బాలలం బాలలం
భావిభారత పౌరులం.
!!చిట్టి!!
--వి. కృష్ణవేణి
వాడపాలెం.
ప్రక్రియ :బాలగేయం