రామప్ప వైభవం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

రామప్ప వైభవం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

రామప్ప వైభవం

తెలంగాణ చరితకు తార్కాణం
తెలంగాణా మణి భూషణం
తెలంగాణా కు సువర్ణం
తెలంగాణ వైభవ నిదర్శనం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కట్టడం
ప్రపంచమే మెచ్చిన కట్టడం
ప్రపంచం గర్వించదగ్గ కట్టడం
ప్రపంచమే వాహ్వా అనే తెలంగాణ కట్టడం

యునెస్కో ఎంపిక చేసిన వారసత్వ సంపద
మన రామప్ప అందించిన విశ్వసంపద
రేచర్ల దేవుడు అందించిన సంపద
మన కాకతీయ వైభవం చాటిచెప్పే సంపద

చిత్రమైన శిల్పసౌందర్యం
విచిత్రమైన నాట్య భంగిమ సౌందర్యం
అణువణువునా మనసుకు హత్తుకునే కళా భంగిమ సౌందర్యం
ఏనుగు చిత్రాలు శివుడు నంది ఆధ్యాత్మిక భంగిమల సౌందర్యం

భళారే భళా చిత్రకారుల కళా నైపుణ్యం
కాకతీయుల కళా ఔన్నత్యం
జగతి మెచ్చిన అపూర్వ శిల్పకళా సంపద ఔన్నత్యం
మన తెలంగాణా కీర్తి కిరీటానికి ఇది ఒక చిరస్మరణీయం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా
            9441530829
 


0/Post a Comment/Comments