- మార్గం కృష్ణమూర్తి
అంశం: వృద్ధాప్య దశ
మనిషి ఎదుగు తుంటే
ఒదిగి ఉండాలి
వయసు పెరుగుతుంటే
అనిగి ఉండాలి
వృద్ధాప్య దశను
ఎవరూ తప్పించు కోలేరు!
కాలపరిస్థితులు,సంఘటనల వలన
మనుషులలో ఆలోచనలు, అందాలు
వయసులు,ఆదాయాలు మారుతాయి
వయసు పెరిగిన కొలది రోగాలు
పక్షవాతాలు ,మానసిక జబ్బులు
చుట్టుముడుతాయి!
చేతిలో అధికారం ఉండదు
చేతిలో డబ్బూ ,హోదా ఉండదు
ఉన్నా వారు బ్యాంకుకూ వెళ్ళలేరు
ఉన్నా కొందరు సంపద అనుభవించలేరు
చెబుతే వినే వారు ఎవరూ ఉండరు
గౌరవించే వారు దరిదాపున కనబడరు!
పిల్లలకు ప్రేమ, తల్లి దండ్రుల పెంపకం పైన
స్నేహితులపైన, సమాజంపైన ,భాగస్వామి
పైన ఆధారపడి ఉంటుంది
నిస్వార్ధ పెంపకం ఎన్నటికీ వృధాకాదు
పూర్వ కర్మ ఫలం తీర్చవలసి ఉంటే తప్పా!
పేదలైన ధనికులైనా, పండితులైన
పామరులైనా, వృద్ధులవుతుంటే
కొన్ని పద్దతులు మార్చు కోవాలి
ఆశలు కోరికలు తగ్గించు కోవాలి
అహాలు ,ఈర్ష్యలు ,కక్షలు తగ్గించాలి!
బెట్టుతనం , మొండితనం తగ్గించాలి
కోపం తాపం ,చిరాకు తగ్గించుకోవాలి
నా డబ్బు , నా ఆస్తి నా సంపద
అనే ఆలోచనలు, సంకుచితత్వం వీడాలి!
డబ్బును గాని , వజ్ర వైడూర్యాలను గానీ
ఎవరూ తినలేరు , అవియే కడుపునింపవు
వృద్ధ వయసులో ఎవరికైనా కావల్సింది
తృప్తి, ఆనందం, సంతోషం, మనశ్శాంతి
అవి పొందాలంటే, యిష్టమైనవారుండాలి
వారితో అనుకూలంగా, కాలం గడపాలి!
నా భార్య / భర్త నేను చెప్పినట్లే వినాలని
నా కొడుకు కోడలు నేనుచెప్పినట్లే వినాలని
నా బిడ్డ అల్లుడు నేను చెప్పినట్లే వినాలని
నా ఆస్తులు నావే , ఎవరూ తినకూడదనే
అహం భావన,చేతులుడిగాక రాకూడదు!
సృష్టిలో ఎవరూ వారి ఆస్తులను తినలేరు
ఎవరూ వారి ఆస్తులను నష్టపరిచి పోలేరు
ఎవరూ తాము గతించే వేళ తీసుకపోలేరు
ఎవరూ ఈ భూమిపైశాశ్వతంగాజీవించలేరు!
చివరి విశ్రాంత గడియలలో తృప్తి, ఆనందం
సంతోషం , ఆరోగ్యం , మంచి గౌరవం
గుర్తింపు , కీర్తి ప్రతిష్టలు పొందాలంటే
పేరు ప్రతిష్ఠలు శాశ్వతంగా నిలవాలంటే!
కోపాలు ,తాపాలు , అహం ఈర్ష్య అసూయ
స్వార్ధం , నియంతృత్వం విడనాడండి
స్వఅనుభవాలతో సమాజాన్నిఅర్ధంచేసుకోండి
ఆస్తి పాస్తుల మీద ఆశలు పెట్టుకోకండి
బరువు భాద్యతలనుండి ప్రక్కకుతొలగండి
భార్య/భర్త కొడుకు కోడలు మనుమలు
చెప్పినట్లు వినాలనే భావనను వదులుకోండి
అడుగ కుండా సలహాలు ఎవరికీ ఇవ్వకండి
చాడీలు చెప్పకండి,విమర్శలు చేయకండి!
అందరితో కలుపు గోలుగా మెదలండి
పిల్లలను ఆప్యాయంగా పలుక రించండి
కూరగాయల ,పూల మొక్కలను పెంచండి
పక్షులు , జంతువులను ప్రేమించండి
ఏదో ఒక మంచి వ్యాపకంలో సేద తీరండి
యోగా , మెడిటేషన్ ప్రారంభించండి
అవకాశముంటే దాన ధర్మాలు చేయండి
చేతనైతే సేవా కార్యక్రమాలు చేపట్టండి
జీవితం ధన్యం చేసుకోండి
మోక్ష ప్రాప్తి పొందండి!
- మార్గం కృష్ణమూర్తి