సినారె సాహితీ వైభవం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

సినారె సాహితీ వైభవం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

సినారె సాహితీ వైభవం

మోడుబారుతున్న  జీవితానికి
మీ కవిత కొత్తచిగురులు పూయించింది
మొద్దు బారిన జీవనానికి మీ కవనం ఉత్తేజపరిచింది
కలలు కంటున్న  జీవితానికి
మీ సాహిత్యం అందమైన కల గా  చుట్టూ ముట్టింది

అందమైన పూదోటలో మీ కవనాలు సుగంధ పరిమళాలు వెదజల్లాయి
పుడమితల్లి మీ సాహితీజల్లుతో పులకరించింది
నిస్సారమైన పుడమి తల్లి నీ సాహితీ విత్తుతో పురుడు పోసుకుంది

మీ సాహితీ రంగ ప్రవేశంతో అక్షరమాలికలు ఆనందం తో పరవశించాయి
మీ ఆగమనం తో సాహిత్యరంగం కొత్తపుంతలు సంతరించుకుంది
మీ శబ్దస్ఫూర్తి అభ్యుదయ రచనలను మేల్కొలిపింది
మీరాకతో సినీ ప్రపంచం ఉత్సాహంతో ఉర్రోతలూగింది

మీ విజ్ఞానానికి దాసోహమంటూ
అనేక పదవులు మీ సింహాసన అధిష్టానాన్ని కోరాయి
మీ విశ్వంభర విశ్వజనీనమై
విశ్వఖ్యాతిలో విశ్వతేజాన్నందించింది



డాక్టరేట్స్ ఎన్నో మీకు అలంకారమై ఆనందించాయి
ఉన్నత పదవులెన్నో మీ ఆశీనంతో
సగర్వం గా తలెత్తుకున్నాయి
భారత్ కు తలమానికమైన పద్మ అవార్డ్స్ మీ చెంత చేరి మురిసిపోయాయి

సాహితీలోకానికి మీరు ఒక విజ్ఞాన గ్రంధాలయం
సాహితీవేత్తలకు మీరొక చిరస్మరణీయ ఆదర్శం
భరతమాత కీర్తి కిరీటం లో మీరొక సాహితీ వజ్రం
సాహితీ వైభవానికి మీ రచనలే స్వర్ణలంకారములు
శారదాంబతల్లికి మీ సాహిత్యమే శిరోదార్యము
అందుకే సాహితీ రత్నమా అందుకోండి మా ఈ సాహితీ వందనాలు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
           టీచర్ సాలూరు
          విజయనగరం జిల్లా
           9441530829


0/Post a Comment/Comments