నేటి చదువులు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు )

నేటి చదువులు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు )

నేటి చదువులు

ఒత్తిడి ఒత్తిడి చదువులు
చిత్తడి అవుతున్న పిల్లల మనసులు
డబ్బు మాత్రమే పెడుతున్నారు పెద్దలు
తల్లిదండ్రుల ఆశలకు ఆశయాలకు
ఒత్తిడికి గురి అవుతున్నారు పిల్లలు

నాటి చదువులు కావు నేడు
నాటి కొలువులు కావు నేడు
కాలం తో పరుగులు తీయాలి
కాసులు పట్టుకు పరుగెత్తాలి

పోటా పోటీ చదువులు
పోటాపోటీ కొలువులు
ప్యాకేజీ కి పరుగులు
ప్రజ్ఞలతో ఫీట్లు

6 అంకెల ఆదాయాని కై ఆరాటం
100%ఫలితాల కై పోరాటం
ఉక్కిరి బిక్కిరి విజ్ఞానం
ఉరుకుల పరుగుల సాధనం

పిల్లల మధ్యా పోటాపోటీ
తల్లిదండ్రుల మధ్య పోటాపోటీ
కళాశాలల మధ్య పోటాపోటీ
పొలికలతో పోటాపోటీ

నలుగుతున్నది పిల్లలే
నలగ్గోడుతున్నది పిల్లలనే
ఒత్తిడి పెరుగుతుంది పిల్లలకే
ఒత్తిడి చేస్తున్నది పిల్లలనే

తినడానికి కాలి లేని చదువులు
తిరగ వేయడానికి సమయం లేని చదువులు
కక్కలేక మింగలేక గుక్కెళ్ళు మింగుతున్న చదువులు
కడుపుకోసం కన్నవారికోసం కానివారితో 
కనిపించని పోటీ గల ఒత్తిడి చదువులు

రచన: పసుమర్తి నాగేశ్వరరావు,
            టీచర్, సాలూరు,
            విజయనగరం జిల్లా,
            9441530829.



0/Post a Comment/Comments