విశ్వనాథ సత్యనారాయణ--పిల్లి.హజరత్తయ్య

విశ్వనాథ సత్యనారాయణ--పిల్లి.హజరత్తయ్య

కవి సామ్రాట్

విశ్వనాథ వారి కవిత్వమే సంస్కృతికి చిహ్నము విశ్వనాధవారి హృదయమే నవ్య నవనీత సమానము

విశ్వనాథ దాతృత్వ మే అతికర్ణము
వారి ఆదరమే అనుభవైకవేద్యము

సంప్రదాయాలు తగ్గుతున్నప్పుడు సాహిత్యంతో మేల్కొలిపెను
విలువలు నశిస్తున్నప్పుడు సాహిత్య మేథతో బ్రతికించెను

దేశ విదేశాలలో అభిమానులను పొందిన మేలు మూలవిరాట్
అత్యున్నత పురస్కారాలను సంపాదించిన కవి సామ్రాట్

విశ్వనాథ లేకపోతే తెలుగు సాహిత్యమే లేదు
విశ్వనాథను మరిస్తే సాహితీ లోకం క్షమించదు

జయంతి పత్రికలో సాహితీ ప్రియులను అలరించెను
కిన్నెరసాని పాటలతో ఆంధ్ర వైభవాన్ని చాటెను

"నాది వ్యవహారభాష" యని ప్రకటించిన విశ్వనాథుడు
ఆంగ్లభాషా వ్యామోహాన్ని ఎండగట్టిన కవీశ్వరుడు

జ్ఞానపీఠ్ అందుకున్న తొలి తెలుగు కవీశ్వరుడు
జాతి ముత్యంగా వెలుగొందిన శతగ్రంధకర్త విశ్వనాధుడు

తెలుగువారి మణిహారమే మన సాహిత్య సురభుడు
తెలుగువారి ఆణిముత్యమే మన విశ్వనాథుడు

---- పిల్లి హజరత్తయ్య,
శింగరాయకొండ,
ప్రకాశం జిల్లా.

0/Post a Comment/Comments