జిందగీ..పరేషాన్..!(కవిత)
అందరూ ఉద్ధరించ బట్టే,
ఈడికి ఏడ్చింది దునియా..!
ఎక్కడి సమస్యలు అక్కడ హాం ఫట్ అన్నట్లే,
మాటల బాతాఖానీ లోనే ఐపోయినాయి..!
ఎవ్వరి ఫికరు దూరం గాలే..!
ఎవ్వరికీ నౌకరీ రాకపాయే..!
సదువు ఎంత సదివినా,
భికారి జిందగీ మిగిలే..!
సచ్చే వరకూ సర్కార్ సాయం బేకార్, బేకార్..!
బేటా,సూడు మా వైపు జర,
అంటే.. ఎవ్వడూ మెహర్బాని చూపడే..!??
ఓట్లప్పుడు..కాళ్ళు మొక్కుతా అంటడు,
పక్కీరోల్ల లాగా గడ్డం పట్టి అడుక్కుంటాడు..,!
ఓటేయమని..!??
చ్చ ఛ..జిందగీ గాల,
జర శరమైన లేకపాయే..!?
మా గరీబొల్ల జీనా ఇంతే..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.