ఊహల గుస గుసలు..!
ఊహలు ఎప్పుడూ నమ్మశక్యం కాని
విధంగా అందంగానే ఉంటాయి..!
ఊహల లోకంలో విహరించడం బాగుంటుంది..!
ఆ కొద్ది సమయానికే..!?
ఎప్పుడూ ఊహల్లోనే ఉంటే,
"జీవితం" అగమ్య గోచరం..!
లక్ష్యం లేని యౌవనం వ్యర్థం..!
పట్టుదల, కృషి లేని జీవితం అర్థ రహితం..!
సాధ్యమైనంత వరకూ ఊహల్ని నిజం చేసుకునేలా..కష్టపడాలి..!
అలా మన స్వప్నాలు వాస్తవ రూపం దాలిస్తే..
జీవితం ధన్యం..!?
ఎలాంటి భావి జీవితాన్ని ఇవ్వని ఊహలు,
పగటి కలలు..మనిషి పతనానికి దారి తీస్తాయి..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ