నిజమే ఎవరు అవునన్నా కాదన్నఇది నిజం
పెద్దలమాటలు పెరుగన్నం మూటలు
పెద్దల మాటలే భావితారానికి బాటలు
పెద్దలు అనుభవ సిద్ధ పూజ్యులు
ఆరోగ్యమే మహాభాగ్యం
ఇంటిగుట్టు లంకచేటు
పోరునష్టం పొందులాభం
నిజము దేవుడెరుగు నీరు పల్లమెరుగు
ఇవి నిత్య సత్యాలు. ఇవి పెద్దలు చెప్పిన జీవిత సత్యాలు
ఈ రోజు విశ్వవ్యాప్తం గా తెలుసుకున్నారు ఆరోగ్యం విలువ
ఆరోగ్యం లేకున్నా ఎంతవున్నా అభాగ్యులం
ఎంత భాగ్యమున్నా నిర్భాగ్యులం
ఇది పెద్దల పెరుగన్నం లాంటి మాట
ఇవి ఎంతో జీవితాన్ని ఒడబోసిన పెద్దల అనుభవాలు
నేటి తరానికి విజ్ఞాన పాఠాలు
భావితారానికి బలమైన గుణపాఠాలు
బంగారు భవిష్యత్తు కు అనుభవాల సారాంశాలు
ఇవి తెలుసుకుంటే పురోగతి
కాదంటే అధోగతి
అనుసరిస్తే సద్గతి
ఆచరిస్తే అద్భుతమైన ప్రగతి
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా