జీవితం..వ్యక్తిగతం.!
గడ్డిపువ్వు లాంటిది మనిషి బ్రతుకు..!
కాలి క్రింద తొక్కినట్లు..
వేరొకరి బ్రతుకుని చిద మొద్దు..!??
సున్నితమైనది మనసు..!
ఎవ్వరిని ఏమనవద్దు..!??
మనస్సుని నొప్పించ వలదు..!?
మాట జారి,మాటంటే..
పూట గడవనట్లు,
ఇష్టం వచ్చినట్లు, ప్రవర్తిస్తే,
వికారంగా వ్యవహరిస్తే.,
పగిలిన అద్దం లాంటి మనస్సు.. అతుకు పడదు,
మునుపటిలా దర్శన మివ్వ దు..!??
ఇష్ట రీతిలో మాటాడి, మరచి పొమ్మంటే..
నీళ్ల లో కలిపిన తైలమును వెతికి వేరు చేసి తీసుకు రమ్మన్నట్లే..!??
లేని పోని ఊత కబుర్లు..!
నమ్మ శక్యం కాని పుకార్లు..!
జీవితాన్ని కాల్చుతుంటే..!
అసత్యాలు రాజ్యమే లుతుంటే...!
నిరూపణకు రాని నిజాలు,
చివరకు అబద్ధాలు గా మిగిలి పోతాయి..!
గాలికి పోయే కంప.. లాంటి
చెత్త వ్యవహారాలు వద్దు..!
జీవితాన్ని ఎవరిది వారికి
జీవించనీయండి ..!?
వేలు పెట్టి చూపించే అధికారం మనకు లేదు..!??
రచన:✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.