మన్యం వీరుడు
మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి
తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి
మన్యంవాసులలో ధైర్యాన్ని పెంపొందించి
గెరిల్ల్లా యుద్ధపద్ధతులను నేర్పించి
గిరిజనుల్లో చైతన్యాన్ని నింపిన మహోజ్వల శక్తి
సాయుధపోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందనినమ్మిచాలా పరిమిత వనరులతో
బ్రిటిష్ సామ్రాజ్యామనే మహాశక్తిని గడగడలాడించి నమ్మిన సిద్ధాంతం కొరకు ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన ఉద్యమశక్తి
ఇతని సాయుధ పోరాటం
స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమై చరిత్రకెక్కింది
ఆయన అకుంఠిత సాహసము
త్యాగదీక్ష,ఏకాగ్రత,సచ్చీలము అనుసరించదగినది
జాతీయ ఉద్యమానికి ఆయన చేసిన సేవ ప్రశంసించదగినది
దేశం కోసం యువత ప్రాణాలిచ్చే సాంప్రదాయానికి కారణభూతుడై
భారతీయ యువకుల ఆరాధ్య దైవంగా
యువత గుండెల్లో చిరస్థాయిగా నిలచిన
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు
--- పిల్లి.హజరత్తయ్య
శింగరాయకొండ
ప్రకాశం జిల్లా