మనసు
పేరు శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
మనసే అందాల బృందావనం
స్వచ్ఛమైనమనసు అందరికీ ఆభరణం.
మనసే మంచిమనిషి శత్రువు
తప్పులను ఎత్తిచూపి నిన్ను నిలేస్తుంది...
మానసిక సంఘర్షణే నరకం...
మంచి మనసున్న మనిషికి నరకమైన స్వర్గం ఐనా మనసే.....
మనసులేని మృగాలకు మనసంటే తెలియదు....
కౄరాలు ఘోరాలు చేసి
మనసుని చంపుకొని మత్తు లో బ్రతికేస్థాయి మానవమృగాలు.
మనసుకు ఉన్న వేగం మరి వాహనానికి లేదు....... ప్రపంచాన్ని చుట్టి రాగల మానసిక వేగం సాంకేతిక పరి జ్ఞానానికి అందనిది......
ప్రేమ ద్వేషం ఆప్యాయత అనురాగం బాధ ఆవేదన
ఆత్మీయత, ఓర్పు నేర్పు, మనిషి లోను తలపుల ప్రక్రియలకు మన సేకర్త..
మనసును మంచిగా మలచుకోవడం మనిషి బాధ్యత......
మనసు గాయపడిన నాడు మనుగడ ప్రశ్నార్ధకం.... అందుకే మనసు ను ప్రేమానురాగాలతో అనుకూల ఆలోచనలతో ఉన్నప్పుడు మనసే అందాల బృందావనం అవుతుంది....