సమాజ దోపిడి
సమాజంలో అనాదిగా ధనికులు పేదల్ని
బూర్జువాలు శ్రామికుల్ని
నిలువుదోపిడీ చేస్తున్నారు
పేదలకష్టాలను కర్షకుల కడగండ్లనీ
శ్రామికుల శ్రమను
దోపిడీచేస్తున్న నరహంతకులు
ధరాధిపతులై సమాజాన్ని
పీల్చి పిప్పిచేస్తున్నారు
దొరికితేదొంగ దొరకకపోతేదొరలా
సమాజాన్ని దోపిడీచేస్తున్నారు
ఆకలితో అలమటించే వాడొకడైతే
తిన్నది అరగక తిరిగేవాడొకడు
అనాదిగా సాగుతోంది
అనంత సంగ్రామం
అనాథుడికి ఆగర్భ
శ్రీమంతుడికి మధ్య
పేదరికంతో మగ్గిపోతున్న ప్రజానికం
శ్రీమంతుల దోపిడీని అరికట్టి
నిలువుకట్టలువేసి నిలువరించి
శ్రమైకజీవన సౌందర్యంతో
ఆనందంగా జీవించాలి
ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు
+91 8762357996