శిఖరాగ్రాన--- డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, సికింద్రాబాద్.

శిఖరాగ్రాన--- డా.రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, సికింద్రాబాద్.

శిఖరాగ్రాన
--- డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,సికింద్రాబాద్.

కలలు కనే కళ్ళకు ఆశల శిఖరాగ్రాలు అందినట్లే అనిపిస్తాయి.
స్వాప్నికుల నిరంతర కృషే
ఇలలో వాటిని సాకారం చేస్తాయి.
పేకమేడలు కట్టుకోకుండా,
అందలాల కోసం ఆత్రపడకుండా,
సానుకూల దృక్పథంతో పయనిస్తేనే,
కోరికల కోటను నిర్మించగలం.
పటిష్ఠమైన ప్రణాళికలతో
సమష్ఠియైన ఆలోచనలతో
నిండైన సాధనలతోనే సాధ్యం.
ఆశల అంచులలోకి వెళ్ళి
జారిపడకుండా చూసుకోవాలి. 
నిరాశల నిచ్చెనలు దిగి
దురాశల వలలకు చిక్కుకుండా
అడ్డంకుల నియంత్రికలను దాటి,
ఆశలపల్లకిలో గమ్యం చేరాలి.
అపజయాలు పలకరించి
వ్యూహాలు బెడిసికొట్టినా
ప్లాను రెండుతో పరుగెత్తి
ఆశల అంచుల్లోకి చేరుకోవాలి.

0/Post a Comment/Comments