కలాం జీ సలాంజీ

కలాం జీ సలాంజీ



కలాం జీ సలాంజీ

కృషి ఉంటే మనుషులు
ఋషులౌతారంటారు మన వేటూరి
అలనాటి వాల్మీకి మహర్షి
ఈనాటి మన కలాంజీ
ఆ కోవకు చెందిన వారే
జననం ఓపేద ముస్లిం కుటుంబంలో
ఓ పేపర్ బాయ్  జీవనం

ఏకలవ్యుని పట్టుదల ఎంతో ఉంది
అందుకే ఓ వైపు ఇంటిపని
ఓ వైపు చదువు  అలా సవ్యసాచియై
అంచెలంచెలుగా ఎదిగాడు
ఉన్నత శిఖారాలు అధిరోహించాడు
పోక్రాన్లో అణు శక్తి నిర్మిత ఆయుధాల
పరీక్షలలో ఓ  కీలకుడయ్యాడు
భారతీయ మిసైల్ యోధుడై వెలసి
దేశ సంరక్షణకై అపార కృషి చేసిన
భౌతిక శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు
ప్రపంచం గర్వించదగిన శాస్త్రజ్ఞుడు

స్వాతంత్ర్యం ముందు గాంధీ అయితే
స్వాతంత్ర్యం తదుపరి మన గాంధీ తాత
మనం గర్వించదగ్గ భారతీయుడు
మతంతో ముడిపడలేదు
మత సామరస్యానికి  ప్రతీకై నిలచి
రాం రాబర్ట్ రహీమ్ ఏక్ హై
అన్న అపర గాంధీ మన మన కలాంజీ

పిల్లలపై అమిత ప్రేమ
విద్యా బోధనపై మక్కువ
భారతీయులే పెద్ద ఆస్తిపాస్తులుగా
ఎదిగిన కొద్దీ ఒదిగిన ఉన్నతుడు 
నిరాడంబరతకు పర్యాయపదం 
భారత రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన
ఓ భారత రత్న మన అబ్దుల్ కలాం
అందుకే అయినాడు ఎందరికో
ఆదర్శ భారతీయుడు
ఆ మహనీయుని వర్దంతి నేడు
ఓ మారు స్మరిద్దాం!
పలుకుదాం జోహార్లు!

డా వి.డి. రాజగోపాల్
9505690690 

0/Post a Comment/Comments