బాల గేయాలు - మార్గం కృష్ణ మూర్తి, హైదరాబాద్.

బాల గేయాలు - మార్గం కృష్ణ మూర్తి, హైదరాబాద్.


బాల గేయాలు

పల్లవి:
మేమే మేమే బాలలం,
భావి తరానికి వారసులం
దేశం గెలుపుకు కారకులం ,
జగతికి మేమే ఆధ్యులం!

చరణం:1
కుల మతాలు మాకూ లేవు
ఈర్ష్య అసూయలు మాకూ లేవు
పేద ధనిక భేదం లేదు
చిన్నా పెద్దా తేడా లేదు      "మేమే మేమే"

చరణం: 2
అందరం బడికి వెళ్ళెదము
కలిసి మెలిసి ఉండెదము
ఒకరివి నొకరికి ఇచ్చెదము
పోటీ పడి చదువెదము       "మేమే మేమే"

చరణం: 3
చక్కగ ఆటలు ఆడెదము
గెలుపు ఓటమిల నెంచెదము
కపటం లేక ఉండెదము
గొప్ప నాయకుల మయ్యెదము  "మేమే మేమే"

చరణం: 4
అమ్మ చెప్పిన పనులు చేసెదము
చక్కగా కూర్చుని చదివెదము
అమ్మ వంటలనే తినదము
హాయిగ నిదుర పోయెదము    "మేమే మేమే"

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments