పిచ్చి ప్రేమ..! --- ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పిచ్చి ప్రేమ..! --- ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పిచ్చి ప్రేమ..!

ప్రేమించిన పాపానికి,
ఒంటరితనం లభించింది..!
పూజించిన పాపానికి,
ఎడబాటు లభించింది..!
నవ్వించిన నవ్వులకు,
బదులు కన్నీరు లభించింది..!
పాడించిన పెదవులకు,
ఎనలేని విషాద నవ్వు లభించింది..!
ప్రేమతో పొగిడిన మాటలకు,
నింద, అసహ్య పూరిత 
చీత్కారం లభించింది..!
నాకు స్వంతం అని భావిస్తే,
వేరొకరికి భార్యగా లభించింది..!
నువ్వే నా లోకం అని చాటితే,
నాకిలా దూరమై తీరని శోకం 
మిగిల్చింది..!
ఓ ప్రేమా నాకెందుకు ఇలా చేశావు,అంటే..!?
పార్వతి,లేని దేవదాసు బతుకు బతకమంది..!
ఓ లైలా ఎందుకు వేశావు, నాకీ శిక్ష అంటే..!?? 
మజ్నూ లా
పిచ్చోడి లా తిరుగుతూ, నవ్వుతూ జీవించ మంది..!
చ్ఛ..
పిచ్చి ప్రేమ..జీవితమే హంగామా..!??

రచన:✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా,తెలంగాణ.

0/Post a Comment/Comments