తెలంగాణ ఉద్యమదీప్తి. పేరు: సి. శేఖర్(సియస్సార్)

తెలంగాణ ఉద్యమదీప్తి. పేరు: సి. శేఖర్(సియస్సార్)

తెలంగాణ ఉద్యమదీప్తి

తెలంగాణ అస్తిత్వం అతడు
పద్యం అతడి పదునైన ఆయుధం
ఆ ఆయుధమే బానిస భయస్త హృదయాలలో నింపెను చైతన్యం
పాండిత్యం పరమార్థం మంచిని మేల్కొల్పడం
ఆయన నమ్మిన సిద్ధాంతం
ఆచరణలో చూపిన రవికిరణం
అరాచకాలను పెకిలించడం
ఆయన నైజం
ఎంతటివాడైనా వాడు నిజామైనా 
బూజు దులపడమే ఆయన గుండెధైర్యం
ఎదలో రగిలిన వేదనలేవైనా
రగిలే పదాలతో రంగలో దూకడమే ఆచార్యుల ఆచారం
అన్యాయానికెదురెల్లడమే
అవి సంకెళ్ళైనా బందించే కారాగారాలైనా బెదరని సంకల్పం
దోచుకునే దొంగలను జైలుగోడలపై తన రాతలతో
ఉరితీసిన ధీరత్వం ఆయన కవిత్వం
ప్రక్రియ ఏదైనా తన సంతకం
ప్రత్యేకం
ఆయన ప్రసంగాలు ప్రతి మనసుకి మనిషికి చైతన్య అడుగులు నేర్పిన వెలుగుదారులు
ఆయనదెపుడు
తిమిరంతో సమరం
ఆయనెపుడు సాహితిజగాన
చైతన్య సూర్యుడే

(దాశరథి గారి జయంతి సంధర్భంగా)

సి. శేఖర్(సియస్సార్)
పాలమూరు,
9010480557.


0/Post a Comment/Comments