"ధర్మ చక్రం" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"ధర్మ చక్రం" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

ధర్మ చక్రం


యుగయుగాన
భక్తులను రక్షించడానికి
దుష్టులను శిక్షించడానికి
దశావతారాలు అవతరించి
సమస్తలోకాన్ని సముద్ధరించిన
పరమపవిత్రుడు పంకజనేత్రుడు

ఇంద్రాది దేవతల్ని కాపాడిన
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు
ప్రళయసమయంలో మర్రియాకుపై
తేలియాడిన హరి సర్వోత్తముడు
రాక్షస సంహారకుడు
కరిమొర విని కాసిన ఘనుడు
అలవైకుంఠపురానికి ప్రభువు
లక్ష్మీవల్లభుడు
వేదప్రతిపాదితమైన దేవుడు
ఆశ్రితులందరికి ఆధారభూతుడు

పెద్దకిరీటమువాడు
పీతాంబరమువాడు
ముద్దులమొగమువాడు
చక్రధర చిన్మయరూపుడు
మానవజీవితాల్ని
సముద్ధరించడానికి
కరోనా రక్కసిని
సంహరించడానికి
సుదర్శనచక్రమెత్తిన
విశ్వవ్యాపకుడు
శ్రీమన్నారాయణుడు

ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు

0/Post a Comment/Comments