ఉండి తీరును..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఉండి తీరును..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఉండి తీరును..!

ఆకు రాలిన చోట,
తొలి చివురు వచ్చి తీరును..!
నెత్తిని కాల్చే ఎండ ఉన్న చోట, చల్లని నీడ సైతం కాచే చెట్టు,
ఉండి తీరును..! 
ఎడారిగా మారిన బ్రతుకు 
లోనూ, చక్కని,పచ్చని పచ్చిక రహదారి కూడ.. నిర్మితమై,
ఉండి తీరును..!
నల్లని మేఘాలకు,బాధ లేదు..నల్లగా ఉన్నామని,తెల్లని మేఘాలు,చల్లని గాలులు ఎన్నడూ వీడని మిత్రులుగా వెంట,
ఉండి తీరును..!
గుట్టల మీద నుంచి దూకే సెలయేటికి బాధ లేదు..కిందికి పడుతున్నానని,తనకి మాత్రమే తెలుసు తనలో ఎప్పటికీ తోడుగా నీళ్ల ప్రవాహం నిజమైన మిత్రుని వోలె, వెంట
ఉండి తీరును..!
రాలిపోయే తారలను చూసి,జాబిలమ్మ ఎప్పుడూ..
ఏమీ తెలీనట్లు నవ్వు చుండును, బయటికి కనిపించక పోతేనేమి..!?, లోపల
ఎంతో బాధ, 
ఉండి తీరును..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments