ఓ అందమా నీవెక్కడ ?... పోలయ్య కవి కూకట్లపల్లి, అత్తాపూర్, హైదరాబాద్.

ఓ అందమా నీవెక్కడ ?... పోలయ్య కవి కూకట్లపల్లి, అత్తాపూర్, హైదరాబాద్.

ఓ అందమా నీవెక్కడ ?

పచ్చని పచ్చికలో నేనక్కడ !

ఎత్తైన పర్వతాల్లో
కప్పిన తెల్లనిమంచులో
పశువుల్లో పక్షుల్లో పచ్చని వృక్షాల్లో
పరవశింపజేసే ప్రకృతిలో నేనక్కడ !

నీటిలో ఈదే చేపల్లో నేనక్కడ !

నీటిమీద తేలియాడే ఓడల్లో నేనక్కడ !

ఏడు రంగుల ఇంద్రధనుస్సులో నేనక్కడ !

పొలంలో పండిన పచ్చనిపైరులో నేనక్కడ !

పురివిప్పిఆడే నెమలి పించంలో నేనక్కడ !

నీలాల నింగిలోఎగిరే పతంగంలో నేనక్కడ !

చెంగు చెంగునదూకే లేగదూడల్లో నేనెక్కడ !

అడవిలో తిరిగే జంతువుల్లో
ఎగిరే రంగురంగుల పక్షులరెక్కల్లో నేనక్కడ !

బడిలో ఆటపాటల్లో మునిగితేలే పసిపిల్లల
ముసిముసి నవ్వుల్లో అమాయకపు చూపుల్లో
అల్లరి చేష్టల్లో నేనెక్కడ !

నవజవ్వని చిలకపలుకుల్లో చిలపిచూపుల్లో నాజూకైన నడుములో
ఎగిరే ముంగురుల్లో జడలో మెడలో కాటుక కళ్ళల్లో
చేతి గాజుల్లో కాలి అందెల్లో కట్టిన చీరలో
పెట్టిన బొట్టులో నేనక్కడ !

జలజలదూకే జలపాతాల్లో గలగలపారే సెలయేరుల్లో 
నిర్మలంగా నిశ్చలంగా ప్రవహించే నదుల్లో నేనక్కడ
తీరం చేరాలని ఆరాటపడే కడలి అలల్లో నేనక్కడ !

విరితోటలో విరిసి గుభాళించే ప్రతిపువ్వులో నేనక్కడ !

గుడి గోపురాల్లో గర్భగుడుల్లో
ప్రతిష్టించిన సుందరదేవతా శిల్పాల్లో నేనక్కడ !

ఓ అందమా నీవెక్కడ? చల్లనైన అమృతహస్తాల్లో
మానవత్వం నిండిన ప్రతిమనిషి అంతరంగంలో నేనక్కడ !

--- రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502 

0/Post a Comment/Comments