అందమైన అనుభవం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

అందమైన అనుభవం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

అందమైన అనుభవం..!(కవిత)

కంటికి కనిపించే దృశ్యాలు,
ప్రకృతి మాత ఒడిలో,
ఆనంద పారవశ్యా లు,
ఎంత సేపు నేను గడిపినా,
తనివి తీరదే..!?
ఇంకే మనాలి..!??
నా మదిలో నిల్చిన, 
ఆ ఆకుపచ్చని 
గుబురు అడవులు..!
ఆ తీగ జాతి చెట్లూ..!
ఆ తీగలతో,
చెట్టు కొమ్మల ముచ్చట్లు ..!!
కొమ్మలపై నిల్చున్న 
ఆ పక్షులు,
మధ్యలో కల్పించుకొని నవ్వు లాటలు..!
ఎంతటి మిత్రత్వం..!?? ఇంకనూ..
చల్లని గాలుల, 
సందడిలో..
సూర్యుని 
లేలేత కిరణాల, ఉత్సాహంతో.!
ఎనలేని ఆనందం, 
మదిలో పుట్టిన వేళ..!
అందమైన ప్రకృతిలో..నాకు
"అందమైన అనుభవం" 
సొంత మైందిలా..!!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments