తోడు నీడ
జీవితం తోడూ నీడల సంగమం
ఒకరి తోడు మరోకరికి అవసరం
పుట్టిన నుండి గిట్టినంతవరకు మనిషికి ఇంకొకరి తోడు అవసరం
చిన్నతనం లో అమ్మానాన్నలు తోడు నీడ ఆలింపు లాలింపు కవ్వింపు తో
చదువుకునే రోజుల్లో స్నేహితులు తోడు నీడ ఆటలు పాటలు చిలిపిచేష్టలుకు
ఇంట్లో పెరుగుతున్న వయసులో తోబుట్టువుల తోడు నీడ అల్లరిచేయడం మారంచేయడం లో
ఉద్యోగం లో సహచరుల తోడు నీడ కర్తవ్యం లో సహాయసహకారాలు
పెళ్లయిన తరువాత భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడు నీడ ఇది వందేళ్ల సహచర్యం
భార్యాభర్తల బంధుత్వం తో బంధువుల తోడు నీడ కథలు కార్యాలు లో
జీవిత పయనం లో ఇరుగు పొరుగు తోడు నీడ మాట మంతి చేదోడు వాదోడుగా
వృద్ధాప్యం లో పిల్లల తోడు నీడ
మనిషి అంతిమ దశలో రెండవ శైశవ బాల్య దశలు గా
నాతిచరామి అంటూ చివరి వరకు భార్యా భర్తలే ఒకరికి ఒకరు తోడూనీడ ఇది దేవుని కల్పించిన బంధం కడవరకు కాటివరకు
ఏడడుగులబంధం తో ఆరు(ఋతువులు)కాలాలు పాటు పంచభూతల సాక్షిగా నలుగురు పెద్దల సమక్షం లో మూడుముళ్లు వేసి రెండు మనసులు ఒకటి గా
అయిన జంటే నిండునూరేళ్ళు తోడు నీడ
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా