వర్షపు రాత్రి..!
వర్షం కురిసిన రాత్రి..
చల్లదనం నిండుకున్న వేళ..,
నా ఇల్లు ఊటిలా అగుపించిన వేళ..!
తనువంతా.. హాయిగా,ఆహ్లాదంగా అనుభూతి నిచ్చిన వేళ..!
మదిలో ఒక రకమైన ఆనందం పుట్టిన వేళ..!
ఆహా ఏమి ఈ వర్షపు మాయనో గదా ననిపించింది..!?
మనో దేహాలు పులకించి పోయాయి..వహ్వా..!
ఏకధాటిగా.. ఓరి దీని దుంప తెగ ఏం కురుస్తోంది..!??
ఆగి ఆగి మల్ల, మల్ల చినుకుల్ని జార విడుస్తోంది..!
ఈ వర్షపు చినుకుల్ని చూస్తుంటే..
బాల్యం వానలో తడిసి ముద్దయిన
మధుర జ్ఞాపకం మదిలో మెదలుతోంది..!
వర్షంలో తడిసిన బాల్యం..
అమ్మ కోపతాపాలు గుర్తుకొస్తున్నాయి..!!
ఈ చల్లని రాత్రిలో చూస్తూ చూస్తూనే..
నిదురలో జారుకున్నాను..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.