ప్రోత్సాహం
చిన్న ప్రశంస
చిన్న ఓదార్పు
చిన్న గుర్తింపు
చిన్న మెచ్చుకోలు
చిన్న అభినందన
చిన్న ప్రోత్సాహం
ఇస్తుంది మనిషికి కొండంత ఉత్సాహం!
ప్రోత్సాహం లేకుంటే
ఆవరించు మనిషిని నిరుత్సాహం!
నిరుత్సాహం ఆవరిస్తే
నిలిచి పోవు మనిషి ఎదుగుదల!
మనిషి ఎదుగుదల నిలిచి పోతే
ఆగి పోవు దేశ అభివృద్ధి!
దేశ అభివృద్ధి ఆగిపోతే
ఇక్కట్ల పాలయ్యేరు దేశ ప్రజలు
ప్రోత్సాహంమానవ వనరుల ఉన్నతికివరం!
మనిషి శిల కాదు, యంత్రమూ కాదు
పంచేంద్రియాలు , కర్మేంద్రియాలతో పాటు
ఆంతరేంద్రియమైన మనసున్న మనీషి
మనిషికి నిరంతరం ఉండాలి ప్రోత్సాహం
లేదంటే అంతా శూన్యం!
పసి పిల్లలకైనా , విద్యార్ధులకైనా
యువకులకైనా , వృద్ధులకైనా
స్త్రీల కైనా , పురుషులకైనా
కార్మికులకైనా , కర్షకులకైనా
కవులకైనా , కవయిత్రులకైనా
పండితులకైనా , పామరులకైనా
శిష్యులకైనా , గురువులకైనా
పక్షులకైనా , జంతువులకైనా
మొక్కలకైనా , తరువులకైనా
అందించాలి ప్రోత్సాహం
పెంచాలి అందరిలో ఉత్సాహం
పాఠించాలి అది ప్రతి నిత్యం!
- మార్గం కృష్ణమూర్తి
- మార్గం కృష్ణమూర్తి