ప్రతిభ కథ
కమల చిన్నతనం లొనే అమ్మ నాన్నలను పోగొట్టుకుంది.కమలకు ఒక తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు.కమల పెద్దది కాబట్టి వారి భారం కూడా కమల పైన పడింది.అయినా కమల తన తమ్ముడిని చెల్లిని తల్లితండ్రులు లేని లోటు తెలియకుండా పెంచాలనుకుంది.వారిని బాగా చదవించాలనుకుంది.అందుకని ఎంతటి కష్టమైన పనినైనా చేద్దామనుకుంది.
కమల నాన్న డ్రైవర్ అవ్వడం వలన అతనికి చేదోడు వాదోడుగా మెకానిక్ పనులలో కొంచెం సాయం చేసేది. ఆ అనుభవం తో ఒక మెకానిక్ షెడ్ లో జాయిన్ అయింది.ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎగతాళి చేసినా పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేసింది. మెకానిక్ లో అన్ని మెలుకవలు నేర్చికొని అతి త్వరగా అనుభవాన్ని సంపాదించింది.
తను సొంతం గా ఒక షెడ్ ను కూడా ప్రారంభించింది.దానికి తన ఓనరే సహాయపడ్డాడు. షెడ్ దిన దిన ప్రవర్ధమానమై మంచి ఉన్నత స్థితికి చేరుకుంది.తమ్ముడు చెల్లెలను మంచి చదువులు కూడా చదివిస్తుంది
అంతేకాకుండా తన షెడ్లో తన లాంటి వాళ్లకు ఎంతో మందికి జీవనోపాధి కల్పించి ధైర్య సాహసాలు అందించి జీవనపోరాటం నేర్పింది.ఒక ఆడపిల్ల మెచ్చనిజం లో ఇంత ప్రతిభ చాటినందుకు ఆ నోటా ఈ నోటా చేరి విషయం మంత్రి వర్యులకు కూడా చేరింది.
అందుకని ప్రభుత్వం ఒక అవార్డ్ ను కూడా ఇచ్చి మరింత ఆర్థికసాయం చేసింది. కమల ఆత్మవిశ్వాసం తో అంచెలంచెలుగా ఎదిగి తమ్ముడి ని చెల్లెలిని చదివించి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించింది.ఎంతోమంది ఆడవాళ్లకు అనాధులకు ఆదర్శం అయ్యింది. ఆత్మవిశ్వాసం ఉంటే అందలం ఎక్కడం సులువు అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
సాలూరు
విజయనగరం జిల్లా
9441530829